Skip to main content

గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి


గర్భిణీ స్త్రీలు, పళ్ళ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

గర్భంతో ఉన్నప్పుడు చిగుళ్లు సాధారణం గా ఎక్కువగా రక్తం కారుతూ ఉంటాయి హార్మోన్ల వలన. అందుకని ప్రతి ఆరునెలల క్లీనింగ్ చాలా ముఖ్యం గర్భిణితో ఉన్నప్పుడు. అంతేకాక రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవటం, మీ చిగుళ్ళు, మీ దంతాల పరిస్థితి ని బట్టి, మీ డెంటిస్ట్ మామూలు కంటే ఎక్కువసార్లు క్లీనింగ్స్ కూడా సూచించవచ్చు.
గర్భంతో ఉన్నప్పుడు ఏమయినా పళ్ళ నెప్పులు లాంటివి వస్తే వాటిని సరిగా ట్రీట్ చేయించుకోకపోతే మీతో పాటు మీ గర్భం లో ఉన్న శిశువు కు కూడా రిస్క్ కావచ్చు, కాబట్టి "అవసరమయిన" ట్రీట్మెంట్స్ చేయించుకోవటం తప్పనిసరి. 


డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


ముందుగా మీరు గర్భం తో ఉన్నట్లు డెంటిస్ట్ కు కాని, వాళ్ల స్టాఫ్ కు కాని చెప్పటం మర్చిపోకండి. దానిని బట్టి వాళ్లు ఎక్సరేలు తీసేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తారు (ఉదా : వీలయినన్ని ఎక్సరే లు గర్భం తర్వాత తీయటం, తక్కువుగా ఎక్సరేలు తీయటం, తీసేటప్పుడు రెండు ఎక్సరే బేరియర్స్ వాడటం లాంటివి). అంతే కాకుండా ఎనస్థీషియా ఇవ్వాల్సి వచ్చినా, ఎమయినా మందులు ఇచ్చినా జాగ్రత్తలు పాటిస్తారు. ఒక్కోసారి మీ గైనకాలజిస్ట్ ను కూడా సంప్రదిస్తారు ఎమయినా ట్రీట్మెంట్ ఇవ్వాల్సివస్తే. 

పిల్లలకు పాలు ఇస్తున్నవారు డెంటిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ కు వెళ్ళవచ్చా? 


డెంటిస్ట్ ల వాడే ఎక్సరే లు కాని, పళ్లకు (అవసరం అయితే) ఇచ్చే ఏనాస్తీసియా మందులు కాని ఫీడింగ్ కు ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఇవ్వవు. ఏమయినా అనుమానం ఉంటె మీ గైనకాలజిస్ట్ ను కనుక్కోండి కాని, అమ్ముమ్మ చెప్పింది అనో, మా పక్కింటి ఆంటీ చెప్పింది అనో మాత్రం, డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళటం మానకండి.

Comments

Popular posts from this blog

ఎక్కువగా కనిపించే దంత సమస్యలు (Dental problems)

చిగుళ్ళసమస్యలు వాటికి తీసుకోవాల్సిన  జాగ్రత్తలు.  మనం ఎంత సరిగా బ్రష్ చేసుకొన్నా, పళ్ళ మధ్యన ఎంతోకొంత తిండి పదార్దాలు ఇరుక్కొని ఉండటం  వలన ,  దంతక్షయం  మొదలు అవుతుంది. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోకపోవటం, అలాగే ఫ్లాస్ చేసుకోకపోవటము, క్రమంతప్పకుండా దంత వైద్యుల దగ్గరకు వెళ్లి, మనం చేసుకొనే బ్రష్ ద్వారా పోని గార   ను తీయుంచుకోనివారిలో దంత క్షయం సాధారణం గా మొదలు అవుతుంది. అలా పేరుకొన్న గార  గట్టిపడి tartar/calculus   తయారు అవుతుంది, ఇది చిగుళ్ళ పైనే కాక, చిగుళ్ళ క్రింద కూడా మొదలవుతుంది. ఇలా మొదలయిన  గార /dental plaque బాక్టీరియా దంతక్షయాన్ని కలిగించటమే కాక, చిగుళ్ళ వ్యాది మొదటి దశ అయిన (gingivitis) Gingivitis is an inflammation of the gums surrounding the teeth caused by a buildup of plaque or food particles. consult dentist for a cleaning / scaling కు కారణం అవుతుంది. చిగుళ్ళ వ్యాధి లో  మొదటి దశ ఈ దశ లో చిగురు వాపు, చిగుళ్ళ వెంబడి బ్రష్ చేస్తున్నప్పుడు రక్తం కొద్దిగా రావటం, అలాగే చిగురుకు,పంటికి మధ్య ఆరోగ్యవంతమయిన పంటి లో ఉండే గ్యాప్ 2,3 మిల్లీమీటర్ లకు బదులు