Skip to main content

ఎక్కువగా కనిపించే దంత సమస్యలు (Dental problems)


చిగుళ్ళసమస్యలు వాటికి తీసుకోవాల్సిన  జాగ్రత్తలు.


 మనం ఎంత సరిగా బ్రష్ చేసుకొన్నా, పళ్ళ మధ్యన ఎంతోకొంత తిండి పదార్దాలు ఇరుక్కొని ఉండటం  వలన ,  దంతక్షయం  మొదలు అవుతుంది. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోకపోవటం, అలాగే ఫ్లాస్ చేసుకోకపోవటము, క్రమంతప్పకుండా దంత వైద్యుల దగ్గరకు వెళ్లి, మనం చేసుకొనే బ్రష్ ద్వారా పోని గార   ను తీయుంచుకోనివారిలో దంత క్షయం సాధారణం గా మొదలు అవుతుంది. అలా పేరుకొన్న గార  గట్టిపడి tartar/calculus   తయారు అవుతుంది, ఇది చిగుళ్ళ పైనే కాక, చిగుళ్ళ క్రింద కూడా మొదలవుతుంది. ఇలా మొదలయిన  గార /dental plaque బాక్టీరియా దంతక్షయాన్ని కలిగించటమే కాక, చిగుళ్ళ వ్యాది మొదటి దశ అయిన (gingivitis) Gingivitis is an inflammation of the gums surrounding the teeth caused by a buildup of plaque or food particles. consult dentist for a cleaning / scaling కు కారణం అవుతుంది.

చిగుళ్ళ వ్యాధి లో  మొదటి దశ

ఈ దశ లో చిగురు వాపు, చిగుళ్ళ వెంబడి బ్రష్ చేస్తున్నప్పుడు రక్తం కొద్దిగా రావటం, అలాగే చిగురుకు,పంటికి మధ్య ఆరోగ్యవంతమయిన పంటి లో ఉండే గ్యాప్ 2,3 మిల్లీమీటర్ లకు బదులు ఎక్కువుగా ఉండటం, అంతే కాక xray లలో పంటి చిగురుకింద calculus కనిపించటం కనిపిస్తాయి. ఈ దశలో ఎటువంటీ నొప్పులు రావటం జరగదు, అందుకని చాలా మంది ఈ దశలో దంతవైద్యుల వద్దకు వెళ్లకపోవటం జరుగుతుంది.

చిగుళ్ళ వ్యాధి లో తర్వాత దశ


చిగుళ్ల వాపు  ను పట్టించుకోకుండా ఉన్నవారిలో ఇది ఉంటుంది.   ఈ దశలో  గార  చిగుళ్ళ కింద ఎక్కువ అవుతూ, పంటి చుట్టూ  ఉండే bone loss మొదలు అవుతుంది, అది క్రమంగా పెరిగి చివరకు నొప్పి తీవ్రతరం అవుతుంది  రావటం, పంటి చుట్టూ ఉండే ఎముక తగ్గిపోవటం వలన పన్ను కదిలిపోవటం, నెప్పులు రావటం జరుగుతుంది. చివరకు పళ్ళు పీకిన్చుకొనే పరిస్థితి వస్తుంది. 

       జాగ్రత్తలు  : చాలా మొదటి దశ లో  ఉన్నప్పుడు  రెగ్యులర్ క్లీనింగ్ , ప్లాస్, మౌత్ వాష్  వాడటం సరిపోవచ్చు. కొద్ది ఎక్కువుగా ఉన్నప్పుడు, వైద్యులు స్కేలింగ్ అండ్ రూట్ క్లీనింగ్  సూచించవచ్చు, కొన్ని పుక్కిలించే మందులు వాడమని చెప్పవచ్చు, ఓ సారి డీప్ క్లీనింగ్  చేసినతర్వాత సాధారణం గా, 2 నెలలో ఇంకొకసారి రమ్మంటారు, అప్పుడు మళ్ళీ గ్యాప్ కొలతలు తీసుకోవటం, అలాగే చిగుళ్ళ ఆరోగ్యం చూడటం చేస్తారు, అంతా బాగుంటే తర్వాత రెగ్యులర్ గా ప్రతి ఆరు నెలలకు డెంటల్ క్లినిక్ కి వెళ్లి  క్లీనింగ్ చేయించుకొంటె చాల వరకు  ఏ సమస్యలు డెంటల్ పరంగా రావు 

పాతరోజులలో కేవలం హ్యాండ్ స్కేలెర్స్ వాడి  క్లీనింగ్ చేసేటప్పుడు నెప్పి బాగానే వచ్చేది కాని, అల్ట్రాసోనిక్ స్కేలెర్స్ వాడి అదీ మంచి స్కిల్ ఉన్న వారు చేస్తే ఎ మాత్రం నెప్పి రావటం జరగదు, వచ్చినా చాలా తక్కువ మోతాదులో వచ్చి ఒకటి రెండు రోజులలో పోతుంది. 

ఒకసారి చిగుళ్ల వాపు  కు ట్రీట్మెంట్ చేసినతర్వాత, చిగుళ్ళ నుండి  రక్తం రావటం  అదీ తగ్గటానికి ఒకటి, రెండు వారాల వరకు, కొందరిలో ఇంకొంత సమయం పడుతుంది. ఒక్కరోజులోనే క్లీనింగ్ చేసినతర్వాత తగ్గాలని ఆశించవద్దు. అలాగే పూర్తిగా తగ్గటానికి  మీ వైద్యులు చెప్పినట్లు, ప్లాస్స్ చేసుకోవటం, మౌత్ వాష్ లాంటివి ఏమయినా రికమెండ్ చేస్తే అవి వాడటం ముఖ్యం.

చిగుళ్ళ వ్యాధి పెరిగినకొద్దీ, సర్జికల్ ట్రీట్మెంట్  అవసరపడవచ్చు. కొన్నిసార్లు పంటిని కాపాడలేక పీకి, దాని ప్లేస్ లో ఇంప్లాంట్ లు  పెట్టటం లాంటివి తప్పకపోవచ్చు.

అన్నిటికంటే ముఖ్యమయినది, చిగుళ్ళ వ్యాధికి, గుండె జబ్బులకు, చక్కర వ్యాధికి లింకులు. చక్కర వ్యాధి గ్రస్తులలో చిగుళ్ళ వ్యాధి రావటం ఎక్కువ అయితే, చిగుళ్ళ వ్యాధి ని ట్రీట్ చేయని వారిలో, చక్కెరవ్యాధి ని తగ్గించటం కష్టం. అలాగే ఈ మధ్యన చిగుళ్ళ వ్యాధికి, గుండె జబ్బులు  రావటానికి అవకాశం ఉన్నది అని కొన్ని స్టడీస్ చెపుతున్నాయి. గుండె జబ్బులు ఉన్న వారిలో చిగుళ్ళ వ్యాధి ఎక్కువుగా మేము చూస్తూ ఉంటె, కొన్ని స్టడీస్ చిగుళ్ళ వ్యాధి వలన కలిగే బ్యాక్టీఎరియల్ ఇన్ఫెక్షన్  రక్తం లో కలసి C-రెయాక్టీవ్ ప్రోటీన్  లెవెల్స్ పెరగటానికి  తద్వారా రక్తనాళాలు క్లాగ్ అవి గుండెపోటు  రావటానికి కారణం అవుతున్నాయని సూచిస్తున్నాయి. అందుకని ఈ మధ్యన దంతవైదులు, గుండెజబ్బు నిపుణులు కలసి ట్రీట్మెంట్  చేయటం కుడా జరుగుతుంది. 

మీ పంటి ఆరోగ్యం కోసమే కాక,  మీ ఓవరాల్ శారీరక  ఆరోగ్య అవసరార్ధం  చిగుళ్ళ వ్యాధులను దయచేసి అశ్రద్ద చేయకండి, నా ఉద్దేశ్యంలో మన వాళ్ళు ఎక్కువుగా అశ్రద్ద చేసే దంత జబ్బులలో ఇది మొట్టమొదటది, ముఖ్యంగా భారతీయులలో ప్రతి నలుగురులో ఇద్దరు, ముగ్గురులో నయినా, చిగుళ్ళ వ్యాధి కనిపిస్తూ ఉంటుంది.

 ఇక్కడ వ్ర్రాసినది, కేవలం సలహా కోసం మాత్రమే, ఇది మీ డెంటల్/మెడికల్ డాక్టర్ లు మిమ్ములను చూసి ఇచ్చే ట్రీట్మెంట్లకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు. మీకు దంత సమస్యలు ఉంటే మీ డెంటిస్ట్ / మెడికల్ డాక్టర్ ను సంప్రదించండి.

Comments