చిగుళ్ళసమస్యలు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనం ఎంత సరిగా బ్రష్ చేసుకొన్నా, పళ్ళ మధ్యన ఎంతోకొంత తిండి పదార్దాలు ఇరుక్కొని ఉండటం వలన , దంతక్షయం మొదలు అవుతుంది. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోకపోవటం, అలాగే ఫ్లాస్ చేసుకోకపోవటము, క్రమంతప్పకుండా దంత వైద్యుల దగ్గరకు వెళ్లి, మనం చేసుకొనే బ్రష్ ద్వారా పోని గార ను తీయుంచుకోనివారిలో దంత క్షయం సాధారణం గా మొదలు అవుతుంది. అలా పేరుకొన్న గార గట్టిపడి tartar/calculus తయారు అవుతుంది, ఇది చిగుళ్ళ పైనే కాక, చిగుళ్ళ క్రింద కూడా మొదలవుతుంది. ఇలా మొదలయిన గార /dental plaque బాక్టీరియా దంతక్షయాన్ని కలిగించటమే కాక, చిగుళ్ళ వ్యాది మొదటి దశ అయిన (gingivitis) Gingivitis is an inflammation of the gums surrounding the teeth caused by a buildup of plaque or food particles. consult dentist for a cleaning / scaling కు కారణం అవుతుంది. చిగుళ్ళ వ్యాధి లో మొదటి దశ ఈ దశ లో చిగురు వాపు, చిగుళ్ళ వెంబడి బ్రష్ చేస్తున్నప్పుడు రక్తం కొద్దిగా రావటం, అలాగే చిగురుకు,పంటికి మధ్య ఆరోగ్యవంతమయిన పంటి లో ఉండే గ్యాప్ 2,3 మిల్లీమీటర్ లకు బదులు